ఆస్ట్రేలియాతో ఢీకొననున్న టీమిండియా
టి-ట్వంటీ వరల్డ్ కప్‌లో టీమిండియా అసలు పోరు మొదలైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన ధోనిసేన... సూపర్-8లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీ కొంటుంది. గాయం కారణంగా ప్రవీణ్ కుమార్ దూరమవడంతో బౌలింగ్ విభాగం బలహీనం అయినందున... జట్టు ప్రధానంగా బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్‌లో సూపర్-8 దశకు చేరుకున్న భారత జట్టు సెకండ్ స్టేజ్‌లో ఫేవరేట్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికాలపై గెలిచిన ధోనిసేనకు ఆసీస్ రూపంలో గట్టి సవాల్ ముందుంది. భారత్ బ్యాటింగ్‌లో బలంగా కనబడుతున్నప్పటికీ... ప్రవీణ్ కుమార్ దూరమవడంతో బౌలింగ్ బలహీనంగా మారింది. దీంతో భారత్ ఇద్దరు పేసర్లతో బరిలో దిగే అవకాశాలే కనబడుతున్నాయి. సౌతాఫ్రికా మ్యాచ్‌కు దూరమైన గంభీర్ ఫిట్‌నెస్ సాధించడంతో... దినేష్ కార్తిక్ డగౌట్‌కే పరిమితమవ్వచ్చు. సూపర్ సెంచరీ చేసిన రైనాకు తోడు యువరాజ్, కెప్టెన్ ధోని, యూసుఫ్ పఠాన్‌లతో భారత్ బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనబడుతోంది. పేపర్‌పై బలంగా కనబడుతున్న టీమిండియా బ్యాట్స్‌మెన్.... జోరు మీదున్న ఆసీస్ పేసర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. నాన్నెస్, టెయిట్, బోలింజర్, హారిస్ లాంటి అసలు సిసలైన పేసర్లు కంగారూల సొంతం. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్, బంగ్లాదేష్ జట్లపై సునాయాసంగా గెలిచిన ఆసీస్... బ్యాటింగ్‌లో మాత్రం మెరుగుపడాల్సి ఉంది. ఒకరిద్దరి వ్యక్తిగత ప్రదర్శనలు మినహా... కంగారూలు సమిష్టిగా రాణించడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌కు వేదికైన బార్బొడోస్ పిచ్‌పై ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడడం ఆసీస్‌కు అడ్వాంటేజ్. ఐదు రోజుల విశ్రాంతి లభించడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. సెమీస్ అవకాశాలు క్లిష్టం చేసుకోకూడదంటే... ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. రెండు ఫేవరెట్‌ల మధ్య జరుగుతున్న ఈ పోరు అభిమానులను కనువిందు చేయడం ఖాయంగా కనబడుతోంది.
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


