Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
సూపర్‌-8లో న్యూజిలాండ్‌ ఓటమి


AA

సమిష్టిగా రాణించిన సౌతాఫ్రికా టీమ్ సూపర్‌-8 మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో న్యూజీలాండ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. డివిలీర్స్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా... అల్బీ మోర్కెల్‌ ధాటిగా ఆడి 40 పరుగులు చేసాడు. మొత్తం ఐదు సిక్స్‌లు బాదిన మోర్కెల్ 18 బంతుల్లో 40 పరుగులు చేసాడు. కలీస్ 31, గిబ్స్ 30 పరుగులతో తమ వంతు సహకారం అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్‌ 157 పరగులు మాత్రమేచేసి పరాజయం పాలైంది. కివీస్ బ్యాటింగ్‌లో ఓపెనర్ రైడర్ ఒక్కడే 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారంతా మెరుగైన ఆట కనబరచలేకపోవడంతో న్యూజీలాండ్ ఓటమి పాలైంది. మోర్కెల్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
Related Articles
Gallery