టి20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన భారత్
టి-ట్వంటీ వరల్డ్ కప్‌లో భారత్ కథ ముగిసింది. సెమీఫైనల్ చేరలేకపోయిన టీమిండియా వంద కోట్ల అభిమానులకు నిరాశనే మిగిల్చింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ధోనిసేన చేతులెత్తేసింది. లక్ష్య ఛేదనలో బరిలో దిగిన లంకను... 143 పరుగుల లోపు కట్టడి చేయకపోగా... కనీసం మ్యాచ్‌ను కూడ కాపాడుకోలేకపోయింది. 164 పరుగుల టార్గెట్‌ను చివరి బంతికి ఛేదించి శ్రీలంక సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. విజయం కోసం చివరి బంతికి మూడు పరుగులు సాధించాల్సిన దశలో కపుగెదెర సిక్స్ కొట్టి జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. తర్వాత జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో గ్రూప్F నుంచి ఆస్ట్రేలియా, శ్రీలంక సెమీస్‌లో ప్రవేశించాయి.
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


