దంబుల్లాలో నేడు ట్రైసీరిస్ ఫైనల్ పోరు
ట్రై సిరీస్ ఫైనల్ పోరుకు అంతా సిధ్ధమైంది. దంబుల్లా వేదికగా ఇవాళ జరిగే తుదిసమరంలో భారత్ , శ్రీలంక తలపడబోతున్నాయి. నిలకడలేని బ్యాటింగ్‌తో ఇబ్బందిపడుతోన్న టీమిండియా సెహ్వాగ్ పైనే భారం వేస్తే...సొంతగడ్డపై సూపర్ ఫామ్‌లో ఉన్న లంక ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఆసక్తికరంగా సాగుతోన్న ట్రయాంగిల్ సిరీస్ తుది దశకు చేరుకుంది. ఇవాళ జరిగే ఫైనల్లో ఆతిథ్యజట్టు శ్రీలంకతో భారత్ టైటిల్ కోసం తలపడనుంది. నిలకడలేని బ్యాటింగ్ , బౌలింగ్ టీమిండియాకు ప్రధాన సమస్యలు.
సిరీస్ ప్రారంభం నుంచీ భారత ఆటతీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. బ్యాటింగ్‌లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. సెహ్వాగ్ తప్పించి మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు. దీనిపై ఇప్పటికే ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫైనల్లో యువ ఆటగాళ్ళు కూడా రాణించాలని సూచించాడు. అటు బౌలింగ్‌లోనూ ఇదే పరిస్థితి. ప్రారంభంలో వికెట్లు తీస్తున్న భారత బౌలర్లు చివరి వరకు దానిని కంటిన్యూ చేయలేకపోతున్నారు.
తుదిపోరులో ఈ బలహీనతను కూడా అధిగమించాలని ధోనీ కోరుకుంటున్నాడు. కాగా దంబుల్లా పిచ్ దృష్ట్యా నలుగురు సీమర్లతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు హోం టీమ్ శ్రీలంకను కూడా బ్యాటింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. బౌలర్లు నిలకడగా రాణిస్తున్నప్పటికీ...బ్యాటింగ్‌లో మాత్రం లంక ఆటగాళ్ళు భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇది రిపీట్ కాకూడదని లంక సారథి సంగక్కరా భావిస్తున్నాడు.
ఇక రికార్డులను చూస్తే టీమిండియా కెప్టెన్ ధోనీకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకూ ధోనీ సారథ్యం వహించిన నాలుగు సిరీస్‌లలోనూ భారత్ విజయం సాధించింది. ఇది కూడా గెలిస్తే లంక గడ్డపై వరుసగా ఐదు టైటిళ్ళు గెలిచిన భారత సారథిగా రికార్డు సృష్టిస్తాడు. మొత్తం మీద రెండు జట్లూ సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ క్రికెట్ పోరు అభిమానులకు కనువిందు చేయనుంది.
Published Date : Saturday, Aug 28, 01:00pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


