ఇండియా విజయ లక్ష్యం 300
ట్రై సిరిస్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక భారత్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు నిర్ణీత ఓవర్లలో 299 పరుగులు చేసి భారత్ కు గట్టి పోటీని ఇచ్చింది. శ్రీలంకలో జయవర్దనే మరియు దిల్షాన్ లు మొదటి వికెట్ కు మంచి బాగస్వామ్యాన్ని అందించారు. దిల్షాన్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. మరోవైపు కెప్టెన్ సంగాక్కర తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 71 పరుగులు చేసి జట్టుకు తన వంతు పరుగులను జోడించారు. మొదటినుంచి మంచి సమయస్పూర్తిగా ఆడిన లంక సింహాలు భారీ స్కోరును సాధించారు. భారత్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా శ్రీలంక పరుగులకు వరదకు కళ్ళెం వెయ్యలేక పోయారు. భారత బౌలర్లలో మునాఫ్ పటేల్, శర్మ చెరో రెండు వికెట్స్ తీయగా...ప్రవీణ్ కుమార్, నెహ్రా మరియు యువరాజ్ తలో వికెట్ తీసారు. బ్యాటింగ్ కి దిగనున్న భారత్ ఫైనల్స్ లో విజయం సాధించాలంటే 300 పరుగులు చేయవలసి ఉంది.
Sri Lanka 299/8 (50.0 ov)
Published Date : Saturday, Aug 28, 06:35pm IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


