Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
మొదటి సెమీస్‌లోఇంగ్లాండ్‌తో ,శ్రీలంక ఢీ..!


AA

టీ ట్వంటీ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు రంగం సిధ్ధమైంది. నేడు జరిగే మొదటి సెమీస్‌లో ఇంగ్లాండ్‌ , శ్రీలంక తలపడనున్నాయి. సూపర్‌ ఎయిట్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు నమోదు చేసిన ఇంగ్లాండ్‌ అదే జోరును కొనసాగించి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్ళందరూ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు గత ఏడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీలంక సూపర్‌ ఎయిట్‌లో భారత్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓపెనర్ జయవర్థనే సూపర్‌ ఫామ్‌తో పాటు మలింగా , మాథ్యూస్ బౌలర్లతో ఉన్న లంకను తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య హొరాహొరీ పోరు జరగడం ఖాయమని క్రికెట్ పండితులు చెపుతున్నారు. ఇది ఇలా ఉండగా మరో సెమీ ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ రెండు వేరు వేరు మ్యాచ్లలో విజేతలుగా నిలచిన రెండు టీమ్ ల వారు ఫైనల్స్కు చేరతారు.


Related Articles
Gallery