Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
పాక్‌, ఇంగ్లాండ్ టెస్ట్‌పై మ్యాచ్‌ఫిక్సింగ్‌ ప్రకంపనలు


AA


పాకిస్తాన్ క్రికెట్‌ను మరోసారి ఫిక్సింగ్ భూతం కమ్ముకుంది. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో నలుగురు పాక్ క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు 'న్యూస్ ఆఫ్‌ ది వరల్డ్‌' అనే ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్‌ సంచలనం కథనం ప్రచురించింది. ఈ పత్రిక చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌కు చెందిన మజర్‌ మజీబ్‌ అనే ఓ బుకీ డబ్బులు తీసుకునే విజువల్స్ సంపాదించిది. దీనిపై స్పందించిన ఐసీసీ విచారణకు ఆదేశించింది. పాక్ కెప్టెన్ సల్మాన్ భట్‌, బౌలర్లు మహమ్మద్ అసిఫ్, అమేర్‌, కమ్రాన్ అక్మల్... కావాల్సినప్పుడల్లా నో బాల్స్ వేసేందుకు మజీబ్‌ నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నలుగురు క్రికెటర్లను స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే బుకీని అరెస్టు చేసారు. ఇదిలా ఉంటే మ్యాచ్‌ మాత్రం కొనసాగుతుందని... ఐసీసీ ప్రకటించింది.

Published Date : August 29, Sunday 01:01PM IST
Watch Video.......
Related Articles
Gallery