Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
నేటినుంచి యూఎస్‌ ఓపెన్‌


AA

ఏడాదిలో చివరి గ్రాండ్‌ శ్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతోంది. రికార్డు స్థాయిలో గ్రాండ్‌ శ్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించిన స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెడరర్‌ ఫేవరిట్‌గా బరిలో దిగుతున్నాడు. ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌ శ్లామ్‌ కూడా సాధించలేకపోయిన ఫెడరర్‌ మరోసారి టైటిల్‌ వేటకు సిద్ధమయ్యాడు. ఇక యూఎస్‌ ఓపెన్‌ మినహా అన్ని గ్రాండ్‌ శ్లామ్‌ టైటిల్స్‌ సాధించిన స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాడల్‌ కెరీర్‌ శ్లామ్‌ కోసం తపిస్తున్నాడు. అదే జరిగితే అన్ని మేజర్‌ టైటిల్స్‌ సాధించిన ఏడో క్రీడాకారుడిగా చరిత్రకెక్కుతాడు.

ఇక లోకల్‌ ప్లేయర్‌ ఆండీ రాడిక్‌ పురుషుల విభాగంలో తమ దేశానికి పూర్వ వైభవం తెస్తాడని అమెరికన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌ కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ ఈసారి కూడా ఫేవరిట్‌గా బరిలో దిగుతోంది. ఓ బిడ్డకు తల్లి కూడా అయిన ఈ బెల్జియం భామకు చెక్‌ పెట్టేందుకు షరపోవా, కుజ్‌నెత్సోవా, వీనస్‌ విలియమ్స్‌ సిద్ధమవుతున్నారు.

Published Date : Monday, Aug 30, 10:35am IST

Watch Video....
Related Articles
Gallery