Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
US ఓపెన్‌ 2వ రౌండ్‌లోకి సానియా


AA


టెన్నిస్ సంచలనం సానియామిర్జా యూఎస్ ఓపెన్‌ రెండోరౌండ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మణికట్టు గాయం బాధపెడుతున్నప్పటికీ.. తొలి రౌండ్‌లో పోర్చుగల్ అమ్మాయి మిచెల్లె లార్చర్‌ను 6-3, 6-2 తేడాతో సునాయాసంగా ఓడించింది. ఫస్ట్ సెట్‌లో శ్రమించాల్సి వచ్చినా.. రెండో సెట్‌లో ఆత్మవిశ్వాసం పెంచుకుని 77 నిమిషాల్లో ఆటను ముగించేసింది. రెండో రౌండ్‌లో 20వ సీడ్‌ రష్యన్‌ ప్లేయర్ అనస్టాసియాతో సానియా తలపడనుంది. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌, వింబుల్డన్‌ పోటీల్లో తొలి రౌండ్‌తోనే వెనుదిరిగి ఘోరంగా విఫలమైన సానియా.. హార్డ్‌కోర్ట్‌పై సత్తా చాటగలనని మరోసారి ప్రూవ్ చేసుకుంటూ.. న్యూయార్క్‌లో చెలరేగి ఆడింది. 2005 యూఎస్ ఓపెన్‌లోనూ ఫోర్త్‌ రౌండ్‌ వరకు చేరి సంచలనం సృష్టించింది సానియా. ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ ఏడాది చివర్లోగా.. సానియా మళ్లీ ఫిఫ్టీ ర్యాంకుకు చేరువయ్యే ఛాన్సుంది.

Published Date : August 31, Tuesday 01:30PM IST

Watch Video......
Related Articles
Gallery