స్పాట్‌ఫిక్సింగ్‌లో మరోముగ్గురు అరెస్ట్
స్పాట్‌ఫిక్సింగ్‌తో పరువు పోగొట్టుకున్న తమ క్రికెట్ జట్టును పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికీ వెనకేసుకొస్తోంది. ఇదంతా తమ దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రంటూ పాక్ హోంమంత్రి రెహ్మాన్ మాలిక్ కొత్త భాష్యం చెబుతున్నారు. ఇంతకుముందు కూడా అనేకసార్లు ఇలాంటి కుట్రపూరిత ఆరోపణలు వచ్చాయని, ఈసారి మాత్రం నిగ్గు తేలుస్తామని సవాల్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఫిక్సింగ్ కేసుకు సంబంధించి లండన్ పోలీసులు మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. తొలుత అరెస్టయి బెయిల్‌పై విడుదలైన బుకీ మజార్ మజీద్‌ను మనీ లాండరింగ్ అనుమానాలతో మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పాక్ హైకమిషనర్, పీసీబీ అధికారులను కలవాల్సిందిగా సోమర్సెట్‌లో వున్న ముగ్గురు పాక్ క్రికెటర్లకు సమన్లు పంపారు. ఇటు లాహోర్ హైకోర్టు కూడా.. ఈనెల ఏడున హాజరవ్వాల్సిందిగా నిందపడ్డ ఏడుగురు క్రికెటర్లకు నోటీసులిచ్చింది. మొత్తమ్మీద పాక్ ఆటగాళ్లంతా గ్రౌండ్‌లో కంటే కోర్టుల చుట్టూనే చక్కర్లు కొట్టాల్సి వస్తోంది.
Published Date : Wednesday, Sep 1, 09:24am IST
Watch Video....
Published Date : Wednesday, Sep 1, 09:24am IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


