Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
టీట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఇంగ్లండ్


AA

క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లండ్‌ చిరకాల స్వప్నానికి చేరువైంది... టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ ఫైనల్‌కు చేరింది. తొలి సెమీస్‌లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంకను ఇంగ్లాండ్‌ బౌలర్లు స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. లంక బ్యాట్స్‌మెన్లలో మాథ్యూస్‌ ఒక్కడే 33 పరుగులతో రాణించాడు. మిగతా వారెవరూ చెప్పుకోదగిని స్కోరు చేయకపోవడంతో... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది....129 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌...ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. 16 ఓవర్లలో 132 పరుగులు సాదించి ఇంగ్లాండ్‌ విజయాన్ని కైవసం చేసుకుంది. కీస్వెటర్‌ 39, లంబ్‌ 33 పరుగులు చేయడంతో లక్ష్యం తేలికైంది. పీటర్సన్‌ ఫామ్‌ను కొనసాగించడంతో ఇంగ్లండ్‌ను విజయం వరించింది.
Related Articles
Gallery