నేడు కంగారులతో తలపడనున్న పాక్
నేడు కరేబియన్ గడ్డమీద జరుగుతున్న ట్వంటీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్ లో ఆఖరి మ్యాచ్ జరగనుంది. సెకండ్ సెమీఫైనల్స్లో ఆసీస్‌తో పాక్ తలపడనుంది. నిన్న జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకపై విజయం సాధించి ఫైనల్స్లో అడుగు పెట్టింది. ఫైనల్స్లో తన ప్రత్యర్ధి కోసం ఇంగ్లాండ్ జట్టు వేచి చూస్తుంది. నేడు జరగబోయే మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఇంగ్లాండ్ జట్టుతో టీ-ట్వంటి ప్రపంచ కప్ కోసం తలపడుతుంది. క్రిందటి సంవత్సరం ట్వంటీ 20 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న పాక్ మరి ఈ సంవత్సరం ఆ ఉత్సాహాంతోనే ముందుకు వెళ్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ సూపర్ ఎయిట్‌లో ఒక విజయం మాత్రమే నమోదు చేసినప్పటికీ మెరుగైన రన్‌రేట్ ఆధారంగా సెమీస్ బెర్త్ దక్కించుకుంది. మరి డిఫెండింగ్ ఛాంపియన్స్తో తల పడనున్న కంగారులను కూడా తక్కువ అంచనా వేయలేము. టోర్నీ ప్రారంభం నుంచీ వరుస విజయాలతో దూసుకెళుతోన్న ఆస్ట్రేలియా పాకిస్థాన్ కంటే బలంగా ఉందనే చెప్పాలి. ఓపెనర్లు వార్నర్ , వాట్సన్ , హస్సీ బ్రదర్స్‌తో పాటు బౌలింగ్‌లో షాన్ టెయిట్ , నాన్స్ నిలకడగా రాణిస్తుండడం కంగారూలకు ప్లస్ పాయింట్. మరి ఎవరు ఫైనల్ బాట పడతారో? ఎవరు ఇంటికి పయనం అవుతారో వేచి చూద్దాం.
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


