ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్
ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగే ర్యాలీలు... కళ్లు చెదిరే ఏస్‌లు... మెరుపులాంటి వ్యాలీలు... అభిమానులను అలరించేందుకు ప్యారిస్‌లోని రోలాండ్ గారోస్ స్టేడియం ముస్తాబయింది. మూడు వారాల పాటు సాగే ఈ టెన్నిస్ సమరంలో ఛాంపియన్‌షిప్ కోసం హేమాహేమీ ఆటగాళ్లు పోటీపడనున్నారు. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఫ్రెంచ్ ఓపెన్‌కు ఉండే స్థానం ప్రత్యేకమైనంది. క్లే కోర్టులో జరిగే అతి పెద్ద టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్. ఈ యేడాది జరుగనున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ టాప్ సీడ్‌గా బరిలో దిగనున్నాడు. ఇప్పటికే 16 టైటిళ్లతో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ తన ఖాతాలో వేసుకున్న ఫెడెక్స్... మరో టైటిల్‌పై కన్నేసాడు. క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నడాల్ ఆధిపత్యానికి చెక్ పెట్టి... గత యేడాది టైటిల్ ఎగరేసుకుపోయిన ఈ స్విస్ సంచలనం... వరుసగా రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు. గాయాల కారణంగా ఇటీవల కొంచెం వెనక్కి తగ్గిన నడాల్... తనకు అచ్చొచ్చిన క్లే కోర్ట్‌లో పుంజుకోవాలని భావిస్తున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ దక్కించుకొని క్లే కోర్టులో తనకు తిరుగులేదని నిరూపించడానికి కృతనిశ్చయంతో ఉన్నాడు. అయితే నడాల్... ఫెదరర్‌తో పాటు జోకోవిచ్, ముర్రే, డెల్ పెట్రో రూపంలో ఎదురయ్యే కఠిన పరీక్షలను అధిగమించాల్సి ఉంటుంది.ఇక మహిళల విభాగంలో అమెరికా నల్ల కలువలు సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ ఫేవరెట్‌గా కనబడుతున్నారు. మహిళా టెన్నిస్‌లో దూసుకువస్తున్న కోవాలు, చోవాలతో పాటు... రిటైర్మంట్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన బెల్జియం తారలు క్లియ్‌స్టర్స్, హెనిన్‌లు వీరికి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవలె పెళ్లి చేసుకున్న భారత సంచలనం సానియా మీర్జా టోర్నీకి దూరం కాగ... మెన్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మాత్రం అర్హత సాధించాడు. వెటరన్ ప్లేయర్స్ లియాండర్ పేస్, మహేష్ భూపతి... డబుల్స్‌తో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Watch Video....
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


