Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ట్రయాంగ్లర్ సిరీస్‌లోలో జింబాబ్వే శుభారంభం


AA

ట్రయాంగ్లర్ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లోనే పసికూన జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. సమిష్టిగా రాణించిన జింబాబ్వే... సొంత ప్రేక్షకుల ముందు భారత్‌కు షాకిచ్చి సిరీస్‌లో శుభారంభం చేసింది. టేలర్‌, ఇర్విన్ హాఫ్ సెంచరీలు సాధించడంతో... భారత్‌ 286 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. టేలర్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా... ఇర్విన్ 67 పరుగులతో చివరి వరకు నాటౌట్‌గా ఉన్నాడు. మసకద్జా 46, కోవెంట్రీ 32, లంబ్ 27, చింగంబరా 24 పరుగులతో తమ వంతు సహకారం అందించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడంతో భారత్ 285 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రోహిత్ 114 పరుగులు చేసాడు. రవీంద్ర జడేజా 61 పరుగులతో రాణించాడు.

watch video
Related Articles
Gallery