Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ట్రైసిరీస్‌లో భారత్ జట్టు బోణీ


AA

రోహిత్ శర్మ చెలరేగి సెంచరీ సాధించడంతో ట్రై సిరీస్‌లో యువ భారత జట్టు బోణీ కొట్టింది. బులవాయెలో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

జింబాబ్వే చేతిలో పరాజయం పాలైన టీమిండియా లంకపై చెలరేగింది. బ్యాటింగ్‌లోను... బౌలింగ్‌లోను పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత యువ జట్టు ఘనవిజయం సాధించింది. బౌలర్లు చెలరేగి లంకను 242 పరుగులకే కట్టడి చేయగా... రోహిత్ శర్మ విజృంభించి సెంచరీ సాధించడంతో 243 పరుగుల టార్గెట్‌ను ఈజీగా రీచయింది.

చేజింగ్‌లో బరిలో దిగిన భారత్‌ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కు 154 పరుగులు జోడించడంతో ఇండియా పటిష్ట స్థితికి చేరుకుంది. విరాట్ కోహ్లీ ఔటయినప్పటికీ... కెప్టెన్ రైనాతో కలిసి రోహిత్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోరోహిత్ శర్మ ఈ సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసాడు.మొత్తం వంద బంతులాడిన రోహిత్‌ 2 సిక్స్‌లు, 6 ఫోర్లు బాది 101 పరుగులతో చివరి వరకు నాటౌట్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 82 పరుగులతో రోహిత్‌కు చక్కని సహకారం అందించాడు. విన్నింగ్ షాట్ కొట్టిన కెప్టెన్ రైనా 24 పరుగులు చేసాడు. ఎంజెలో మాథ్యూస్, కెప్టెన్ దిల్షాన్ హాఫ్ సెంచరీలు సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 242 పరుగులకు ఆలౌట్‌ అయింది. మాథ్యూస్ 75, దిల్షాన్ 61 పరుగులు చేసాడు.

WatchVideo
Related Articles
Gallery