Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
స్పాన్సర్ గా మళ్ళీ సహారా ఇండియా


AA

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌షిప్‌ను సహారా ఇండియా మరోసారి కైవసం చేసుకుంది. బిడ్డింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్‌తో పోటీ ఎదుర్కొన్న సహారా భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసి స్పాన్సర్‌షిప్‌ దక్కించుకుంది. ఈ ఒప్పందం మూడున్నరేళ్ళకు వరకూ ఉంటుందని బోర్డ్ వర్గాలు తెలిపాయి. తాజా ఒప్పందం ప్రకారం ఒక్కో మ్యాచ్‌కూ 3.35 కోట్ల రూపాయలు సహారా బీసీసీఐకి చెల్లించనుంది. ఇటీవలే ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ పుణేను 1700 కోట్లకు కొనుగోలు చేసిన ఈ కంపెనీ జట్టు స్పాన్సర్‌గా ఇకపై కొనసాగదని వార్తలు వచ్చినప్పటికీ అవి ఊహాగానాలేనని తేలిపోయింది. కాగా 2013 డిసెంబర్ 31 వరకూ భారత క్రికెట్‌జట్టుతో పాటు మహిళల జట్టు , అండర్ 19 జట్లకు కూడా సహారానే స్పాన్సర్‌గా కొనసాగనుంది.

వీడియో
Related Articles
Gallery