Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
మరో పరాజయాన్నిమూటగట్టుకున్నభారత్


AA

ట్రయాంగ్లర్ సిరీస్‌లో భారత్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. దీంతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంక, జింబాబ్వే ఫైనల్‌కు చేరాయి. చండీమాల్ చెలరేగి సెంచరీ సాధించడంతో మరో 10 బంతులుండగానే లంక 269 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. కెరీర్‌లో తొలి సెంచరీ చేసిన చండీమాల్‌ 111 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. కోహ్లీ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూసుఫ్ పఠాన్ 44, అశ్విన్ 38 పరుగులతో రాణించారు.

Watch Video....
Related Articles
Gallery