Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
5సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్స్‌ను గెలిచిన నాదల్‌


AA

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌రోలాండ్ గ్యారోస్‌లో పాగా వేసాడు. ఏకపక్షంగా ముగిసిన ఫైనల్‌ మ్యాచ్‌లో రాబిన్ సోడర్లింగ్‌పై విజయం సాధించి... గత యేడాది కోల్పోయిన ఫ్రెంచ్ ఓపెన్‌ను తిరిగి దక్కించుకున్నాడు. నాదల్‌ చేతిలో చిత్తయిన సోడర్లింగ్ వరుసగా రెండోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు.తనను క్లే కోర్ట్ కింగ్ అని ఎందుకంటారో రఫెల్ నాదల్‌ మరోసారి చాటి చెప్పాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని రుజువు చేసాడు.

ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 6-2, 6-4 తేడాతో వరుసగా మూడు సెట్‌లు గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తాజా విజయంతో గాయాల కారణంగా గత యేడాది కాస్త వెనక్కి తగ్గిన నాదల్‌... విమర్శకులకు ధీటైన జవాబిచ్చాడు.తొలిసెట్‌లో సోడర్లింగ్ మూడో సర్వీస్‌ను బ్రేక్ చేసిన నడాల్... వెనుదిరిగి చూడలేదు. లభించిన ఆధిక్యాన్ని చివరి వరకు కొనసాగించి సెట్‌ను దక్కించుకున్నాడు. సోడర్లింగ్‌కు మూడు సార్లు నాదల్‌ సర్వీస్ బ్రేక్ చేసే అవకాశం లభించినప్పటికీ... క్లే కోర్ట్ కింగ్ ప్రత్యర్థికి ఛాన్స్‌ ఇవ్వలేదు.

తొలిసెట్ గెలిచిన ఉత్సాహంతో నాదల్‌ సెకండ్ సెట్‌లో విజృంభించాడు. వరుసగా రెండు సర్వీస్‌లు బ్రేక్‌ చేసి రెండో సెట్‌ను ఈజీగా గెలిచాడు. ఇక మూడో సెట్‌లో సోడర్లింగ్ మొదటి సర్వీస్‌నే బ్రేక్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అదే ఆధిక్యాన్ని చివరి కొనసాగించి మూడో సెట్‌తో పాటు మ్యాచ్‌లో విజేతగా నిలిచి ఛాంపియన్‌గా అవతరించాడు. సోడర్లింగ్ రన్నరప్‌తోనే తృప్తి పడాల్సి వచ్చింది. నాదల్‌ మొత్తం ఐదు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకొని... స్వీడన్ దిగ్గజం జాన్ బోర్గ్‌ సరసన నిలిచాడు. గతయేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎదురైన ఓటమి కారణంగా కోల్పోయిన నెంబర్ వన్ ర్యాంకు... తిరిగి ఫ్రెంచ్ ఓపెన్‌లోనే సాధించనున్నాడు.

Watch Video....
Related Articles
Gallery