Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
సాకర్ ప్రపంచకప్ లో సందడి చేయనున్న షకీరా


AA

సాకర్ ప్రపంచకప్‌లో షకీరా మళ్ళీ సందడి చేయబోతోంది. ఇప్పటికే ఒక అఫిషియల్ థీమ్‌ సాంగ్‌లో స్టెప్పులేసిన ఈ అమ్మడు శుక్రవారం జరగబోయే ఓపెనింగ్‌ సెర్మనీలో మరో పాప్‌ స్టార్ జాన్స్‌తో కలిసి ఆడి , పాడి అభిమానులను అలరించబోతోంది. ప్రముఖ పాప్ సింగర్ షకీరాకు , సాకర్‌ ప్రపంచకప్‌కు అవినాభావ సంబంధమున్నట్లుంది. 2006 లో తొలిసారిగా సాకర్ ప్రపంచకప్‌కు థీమ్‌ సాంగ్‌ చేసిన షకీరా ఈ ఏడాది కూడా అఫిషియల్ సాంగ్‌లో ఆడి పాడింది.

జర్మనీలో జరిగిన ఫిఫా వాల్డ్‌కప్ ఫైనల్లో నడుం తిప్పుతూ అభిమానులను మత్తెక్కించిన ఈ అమ్మడు తమకు బాగా కలిసొచ్చిందని ఫిపా నిర్వాహాకులు భావిస్తున్నారు. అందుకే ఈ సారి ఓపెనింగ్ సెర్మనీలో ఆమె చేత పాడించాలని నిర్ణయించారు.కొలంబియన్ పాప్ సింగర్ జాన్స్‌తో కలిసి ఓపెనింగ్ సెర్మనీలో షకీరా సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ పాప్ క్వీన్ చేసిన దిస్ టైమ్ ఫర్ ఆఫ్రికా థీమ్‌ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

లైనోల్ మెస్సీ , డానీ ఆల్వేస్ , కార్లోస్ కామెనీ తదితర ప్రముఖ ఆటగాళ్ళ విన్యాసాలతో మిక్స్ చేసిన ఈ వీడియో సాంగ్ ప్రస్తుతం హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్న సాకర్ ఫీవర్‌కు షకీరా హాట్ హాట్‌ స్టెప్పులు తోడైతే ఇక అభిమానులకు పండగే అని చెప్పాలి.

Watch Video.....
Related Articles
Gallery