మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత జపాన్
* ఫైనల్లో అమెరికాపై విజయం
* పెనాల్టీ షూటౌట్‌లో నెగ్గిన జపాన్
మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను జపాన్ కైవసం చేసుకుంది. ఫైనల్లో జపాన్ అమెరికాపై విజయం సాధించింది. హోరాహోరీగా టైటిల్ పోరులో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. మ్యాచ్ ముగిసేటప్పటకీ చెరో రెండు గోల్స్ సాధించడంతో స్కోర్ సమమైంది. దీంతో ఫలితం కోసం అదనపు సమయం కేటాయించారు.
అయితే ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ ఫలితం తేలకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. పెనాల్టీ షూటౌట్‌లో జపాన్ 3-1 గోల్స్ తేడాతో అమెరికాపై గెలిచి కప్ అందుకున్నారు. జపాన్ గోల్ కీపర్ అయుమి షూటౌట్‌లో రెండు గోల్స్ అడ్డుకుని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. గత ఏడాది సునామీ , భూకంపాలతో అతలాకుతలమైన తర్వాత ఒక మేజర్ టైటిల్ గెలవడం జపాన్‌కిదే తొలిసారి.
Published Date : Monday, 18/7/2011 2:40 PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


