షొయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకోనున్న సానియా
ఇటీవల చిన్ననాటి స్నేహితుడు సోహ్రాబ్ మీర్జాతో పెళ్లి కాన్సిల్ చేసుకున్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో మ్యారేజ్ ఫిక్స్ అయింది. వచ్చే ఏప్రిల్ నెలలో వీరి వివాహం జరుగనుంది. ఈ విషయాన్ని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ధృవీకరించారు. ఆట కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలే చిన్ననాటి స్నేహితుడు సోహ్రాబ్‌తో పెళ్ళి రద్దు చేసుకున్న సానియా ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోనుంది. దీనికి సంబంధించి పాక్‌కు చెందిన ప్రముఖ ఛానెల్ కథనం ప్రసారం చేసింది. ఈ కథనం ప్రకారం సోహ్రాబ్‌తో వివాహం రద్దైన తర్వాత సానియాను పెళ్ళి చేసుకుంటానంటూ మాలిక్ ప్రపోజ్ చేయడంతో రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. అయితే పెళ్లి విషయమై మాట్లాడేందుకు వచ్చే నెల 7న మాలిక్ తల్లి హైదరాబాద్ రానుంది.
మరోవైపు సానియా, షోయబ్‌ను పెళ్లి చేసుకునే విషయాన్ని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ధృవీకరించారు. అయితే వివాహ తేదీ ఖారరు కాలేదని తెలిపారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరి పెళ్లి హైదరబాద్‌లోనూ... రిసెప్షన్ లాహోర్‌లో జరుగనున్నట్టు తెలుస్తోంది. పెళ్లైన తర్వాత కూడా సానియా ఆటను కొనసాగించనుంది. ప్రతిష్టాత్మకమైన కామన్‌వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌తో పాటు 2012 ఒలింపిక్స్‌లో కూడా ఆమె భారత్ తరపునే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ఆట కొనసాగించే విషయమై తనకెలాంటి అభ్యంతరం లేదని, వచ్చే ఒలపింక్స్‌లో సానియా మెడల్ గెలవాలని కోరుకుంటున్నట్లు మాలిక్ చెప్పాడు. పెళ్లైన తర్వాత సానియా, షోయబ్ దంపతులు దుబాయ్‌లో స్థిరపడనున్నట్లు తెలిసింది.

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |