Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
అంతర్జాతీయ కెరీర్‌కు భూటియా గుడ్‌బై


AA

భారత ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ భైచుంగ్ భూటియా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 34 ఏళ్ళ భూటియా గాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా గాయలతో ఇబ్బందిపడుతోన్న భూటియా జనవరిలో జరిగిన ఆసియాకప్‌లో కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆడగలిగాడు. తర్వాత పలు టోర్నీలకు దూరమవడం అతనిపై ప్రభావం చూపింది.

అటు 2014 ప్రపంచకప్‌ క్వాలిఫైయింగ్‌కు ప్రకటించిన భారత జట్టులో భూటియాకు చోటు దక్కలేదు. గాయం నుండి కోలుకున్నాక సిక్కిం యునైటెడ్ తరపున ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే గాయం తిరగబెట్టడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు.1995 నుండి భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన భూటియా 109 మ్యాచ్‌లు ఆడి 43 గోల్స్ చేశాడు.

Published Date : Thursday, 25/8/2011 12:12 PM IST
Related Articles
Gallery