Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
మంత్రులపై రాయపాటి అవినీతి ఆరోపణలు


AA

రోశయ్య క్యాబినెట్‌పై అవినీతి ఆరోపణలు చేసిన రాయపాటి తీరును పలువురు మంత్రులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. కేంద్రమంత్రి పదవి కోసమే ఆయనీ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం ఆశించి గుంటూరు ఎంపి రాయపాటి మంత్రులపై వ్యాఖ్యలు చేస్తున్నారనేది చర్చనీయాంశమైంది. రోశయ్య సర్కారుపై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర క్యాబినెట్‌లో కూడా మధుకోడా తరహాలో అవినీతి మంత్రులున్నారని ఆయన చేసిన తీవ్ర ఆరోపణలతో కాంగ్రెస్‌ ఇరుకునపడింది.

మూడు దశాబ్దాలుగా తను పార్టీకి చేసిన సేవకు తగిన గుర్తింపు లభించలేదని రాయపాటి అసహనం వ్యక్తం చేశారు. రాయపాటి స్వప్రయోజనాల కోసమే ఈ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. గుంటూరు ఎంపి రాయపాటి...జిల్లా మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు చెక్ చెప్పేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి పదవి దక్కలేదనే నిరాశతోటే ....ఈ సంచలన వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎంపీ వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడుతున్నారు. కేబినెట్‌లో ఒక్కరు కూడా అవినీతిపరులు లేరని వ్యవసాయశాఖమంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఎవరైనా అవినీతి పరులు ఉన్నారని నిరూపిస్తే ప్రజల ముందు తల వంచడానికి సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాయపాటి వ్యాఖ్యలకు టీడీపీ మద్దతు పలికింది. గత ఆరు సంవత్సరాలుగా తమపార్టీ చెబుతున్న విషయాలనే రాయపాటి చెప్పారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు అన్నారు. అయితే రాయపాటి ఇప్పటి వరకు అవినీతిపై ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని మంత్రులందరూ అవినీతిలో కూరుకుపోయారని ఎర్రన్నాయుడు ఆరోపించారు. రాయపాటి వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీసిన నేపథ్యంలో .....ఆయన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని పలువురు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.


Watch Video...
Related Articles
Gallery