నేడు సీఎం గుంటూరు పర్యటన

ముఖ్యమంత్రి రోశయ్య ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన ప్రజాపథం ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. ఆయన ఈ రోజు గుంటూరు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉదయం 11 గంటలకు రాజీవ్ గృహ కల్ప సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం డిఆర్‌డిఏ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. అగ్రిగోల్డ్ హాయ్ ల్యాండ్‌ను సీఎం ప్రారంభిస్తారు. రోశయ్య పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు ఆయన పార్టీ శ్రేణులకు ''వేసవిని లెక్క చేయకుండా ప్రజల మధ్యకు వెళ్లండి.. వారి ఆవేదనలు వినండి.. పరిష్కరించడానికి ప్రయత్నించండి.. వేసవిలో మంచి నీటి సమస్య గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది..అందుకే దీనికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి అక్కడికక్కడే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం.. అని సిఎంపేర్కొన్నారు..
Watch Video...
Watch Video...
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

