ప్రజాపథం జరిగిన తీరు పై ప్రభుత్వం సంతృప్తి
ప్రజాపథంలో ప్రజా ప్రతినిధుల హాజరుపై ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది. టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ప్రజాపథాన్ని బహిష్కరించాలని... నిలదీయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాపథం జరిగిన తీరుపై ప్రభుత్వ వర్గాలు.. ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల 14న ప్రారంభమైన ప్రజాపథం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రోశయ్య ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈనెల 10న గుంటూరు, 11న మెదక్ జిల్లా జహిరాబాద్‌లో , 15న కర్నూలు జిల్లాలో జరిగే ప్రజాపథం లో పాల్గొంటారు. ప్రతి రోజు ఐదు పంచాయతీల చొప్పున ఇప్పటి వరకు 265 నియోజకవర్గాల్లోని 19వేల 570 గ్రామాల్లో ప్రజాపథాన్ని నిర్వహించారు. ఇందులో 5801 గ్రామ పంచాయతీల్లో అక్కడికక్కడే మంచినీటి సమస్య పరిష్కరించారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో 51 కోట్లతో 2వేల 155 పనులను మంజూరు చేశారు. 4వేల 904 గ్రామ పంచాయతీల్లో తాగునీటిని రవాణా చేస్తూ సరఫరా చేస్తున్నారు. 9వేల 545 గ్రామపంచాయతీల్లో లో వోల్టెజీ సమస్య పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ప్రజాపథానికి ప్రజాప్రతినిధుల హాజరు బాగుందని ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన 141 , టీడీపీ 84 , పీఆర్పీ 17 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు 7వేల 285 గ్రామపంచాయతీల్లో, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు 3వేల 810, పీఆర్పీ వాళ్లు 675 గ్రామపంచాయతీల్లో పాల్గొన్నారు. ఎండల తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కృషి చేస్తున్నారని సీఎం అభినందించారు. ప్రజాపథం విజయవంతానికి కృషి చేస్తున్న వారందరికి రోశయ్య కృతజ్ఞతలు తెలిపారు.
Watch Video...

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |