Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
ధర్మాన లేఖపై స్పందించిన సీఎం


AA

శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ పనుల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా ముఖ్యమంత్రి రోశయ్య విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. మంత్రుల అవినీతిపై అధికార పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఎం విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉపాధి హామీ పనుల్లో రెవిన్యూ శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందిగా ఆయన రాసిన లేఖపై సీఎం స్పందించారు. శ్రీకాకుళం జిల్లా గుమ్మపాడు నుంచి ఆశోకం గ్రామం వరకు మెటల్ రోడ్ల నిర్మాణం, సింగుపురం పంచాయతీ పరిధిలో మెటల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతి, అధికార దుర్వినియోగం జరిగాయని స్థానిక టీడీపీ నేతలు మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఎలాంటి సంబంధంలేని పనులపై తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలకు మనస్తాపం చెందిన ధర్మాన ఈపనులపై విచారణ జరిపి... ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిందిగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన రోశయ్య వెంటనే విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రెవిన్యూ శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని ఆయన సీఎంకు లేఖ రాయడాన్ని ఎర్రన్నాయుడు తప్పుపట్టారు. కేవలం ఆయన బండారం బయటపడకుండా ఉండటానికే లేఖ రాశారని ఎద్దేవా చేశారు. మంత్రులపై స్వంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఎం సత్వరమే స్పందించి ధర్మానపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.


Watch Video...
Related Articles
Gallery