రాజ్యసభ ఎన్నికలపై అల్లు గురి!?

ప్రముఖ నిర్మాత ప్రజారాజ్యం పార్టీ నాయకుడు మరియు ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా. ఇందులో ఒక సీటు కోసం ప్రజారాజ్యం పార్టీ కసరత్తులు చేస్తుంది. ఇందుకుగాను కాంగ్రెసుతో బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు మార్లు చిరంజీవి ఆ విషయంపై ముఖ్యమంత్రి కె.రోశయ్యతో, (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్తో భేటీ అయినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసేందుకు పార్టీ మరో నాయకుడు సి. రామచంద్రయ్య సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాము కాంగ్రెసుతో గానీ తెలుగుదేశం పార్టీతో గానీ లేమని, త్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తామని చిరంజీవి సోమవారం విశాఖపట్నంలో చెప్పారు. ప్రజారాజ్యం పార్టీకి ప్రస్తుతం 18 మంది సభ్యులున్నారు. ప్రజారాజ్యం ఒక్క రాజ్యసభ సీటును గెలవాలంటే ఆ పార్టీకి మరో 23 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయినా ఫలితం లభిస్తుందనేది వట్టి మాటగానే మిగిలింది.
Click Here to View/Post Comments (3)
| Anonymous :
i haven\'t found any updates research paper online
ram :
sir ... latest news update cheyaraa
sriram :
He should explain to the public as to why he wants a Rajya Sabha Seat and what is his eligibility
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

