Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
బాలయ్య దూకుడుకు సీనియర్ల కళ్లెం


AA

* సింహ మేనరిజంపై బాబుకు కంప్లైంట్‌
* బాలయ్య దూకుడుకు ముకుతాడు
* నియంత్రణలేని సింహా డైలాగులు
* తమ్ముళ్లకు వేడిపుట్టిస్తోన్న సింహా
* మాస్‌ డైలాగులపై సీనియర్ల మల్లగుల్లాలు
* రోజుకో ప్రకటనతో గర్జిస్తున్న సింహా
* ఉప ఎన్నికలకైనా సై అంటున్న బాలయ్య
* తెలంగాణకు వెళుతున్నానని సంకేతం
* బాలయ్య డైలాగ్స్‌పై సీనియర్ల లుక్‌మ


బాలయ్య దూకుడు పార్టీ వర్గాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలుగు తమ్ముళ్లకు ఆయన డైలాగ్‌లు నూతనోత్సాహాన్నిస్తోంది. అధిష్టానం మాత్రం ఆ డైలాగులతో వచ్చే లాభనష్టాలపై బేరీజు వేస్తోంది. తెలంగాణలోనూ పర్యటిస్తానని తాజాగా సింహా చేసిన ప్రకటన సీనియర్లను సైతం ఆలోచింపచేస్తోంది. ...పార్టీకి కొత్త లుక్‌ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. బాలయ్యను రంగంలోకి దింపారు.

చూసి రమ్మంటే..కాల్చి వచ్చారనే సామెతగా ప్రత్యర్థులపై బాలయ్య కాలుదువ్వుతున్నారు. ఇది, మాస్‌ రాజాలు ఈలలు వేయడానికి ఉపయోగపడుతోంది. సంప్రదాయ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతోందని పార్టీ అంతర్గత సమావేశాల్లో సీనియర్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం.

వియ్యంకుడు బాలయ్య చేదోడువాదోడుగా ఉంటారని చంద్రబాబు భావిస్తున్నారు. ఒక వైపు బాలయ్య తాను రాష్ట్రాన్ని చుట్టేస్తామని కృష్ణా జిల్లా పోరుబాటలో బాబు ప్రకటించారు. దీంతో మరింత ఉత్సాహం పెంచుకున్న సింహా ఉప ఎన్నికల్లో పోటీకైనా సై అంటూ ప్రకటించారు. అంతేకాదు,త్వరలో తెలంగాణలోనూ పర్యటిస్తానని ఆయన చేసిన ప్రకటనను సీనియర్‌ నేతలు ఆహ్వానిస్తున్నారు.

సీనియర్లతో జరిగిన భేటీలో చంద్రబాబు దృష్టికి బాలయ్య వాలకం వెళ్లింది. ప్రధానంగా వైజాగ్‌లో బాలయ్య తొడగొట్టడం, మీసం మెలేయ్యడంపై వంటి వాటిపై వారి మధ్య చర్చ జరిగిందని తెలిసింది. బలమైన సామాజికవర్గానికి చెందిన చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.

హుందాగా ఉంటే....మరింత పొలిటికల్‌ మైలేజి బాలయ్య వల్ల పార్టీకి వస్తుందని సీనియర్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలిసింది. లేదంటే, అసలుకే మోసం వస్తుందని అంచనా వేస్తున్నారు.

Published Date : Friday, 27/1/2012 9:52 AM IST


Watch Video...
Related Articles
Gallery