హైటెక్ ముఖ్యమంత్రిగా బాబుకు ముద్ర

* రైతు బాంధవునిగా వైఎస్‌కు గుర్తింపు
* రైతుల్లో వైఎస్ తరహా గుర్తింపునకు బాబు యత్నం
* రైతుల కోసం మరిన్ని పోరాటాల దిశగా బాబు
* రైతువ్యతిరేక ముద్రను చెరిపేసుకునేందుకు బాబు ప్రయత్నం
* రైతుల్ని ఆకర్షించిన వైఎస్‌ఆర్ గెటప్
* వైఎస్‌ఆర్ పాదయాత్రకు ఆదరణ
* వైఎస్ వెంట కదిలొచ్చిన రైతాంగం
* రైతు బాంధవునిగా వైఎస్‌కు ప్రత్యేక ముద్ర
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి రైతాంగంలో వచ్చిన గుర్తింపును టీడీపీ సీరియస్‌గా తీసుకుంటోంది. ఆ ముద్ర నుంచి రైతుల్ని మరల్చడానికి మరింత దూకుడుగా ఉద్యమాలు చేయడం అవసరమని భావిస్తోంది. రైతుల్లో ఒకరిగా మారాలని చంద్రబాబుకు సీనియర్లు సూచించినట్టు తెలిసింది. ...రైతుల్లో వైఎస్‌ఆర్‌కు ఉన్న గుర్తింపు కోసం చంద్రబాబు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. రైతు సమస్యలపై గత ఏడేళ్లుగా నిరంతరం పోరాడుతున్నారు.
వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం నిరాహారదీక్ష చేశారు. అసెంబ్లీని స్థంభింపచేసి, రాత్రంతా అక్కడే పడుకున్నారు. రైతాంగం సమస్యల తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారస్సుల్ని అమలు చేయాని జాతీయ స్థాయి పోరాటానికి బాటలు వేశారు. రైతాంగం కోసం చేస్తోన్న పోరాటాల్ని గణతంత్ర దినోత్సవం నాడు సీనియర్లతో చంద్రబాబు సమీక్షించారు. నిరంతరం పోరాటాలు చేస్తున్నప్పటికీ రైతాంగానికి చేరువకాలేకపోతున్నామని వాళ్లు మథనపడుతున్నారు.
వైఎస్‌ఆర్ వేసిన బలమైన ముద్రను చెరిపేయడానికి మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతు సమస్యలపై లోతుగా అధ్యయనం జరిపి, వాటిపై పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఐటికి చంద్రబాబు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో రైతు వ్యతిరేకిగా ముద్ర పడింది. దాన్ని కాంగ్రెస్ బలంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బాబుపై అదే నినాదాన్ని కాంగ్రెస్ పదేపదే వినిపించింది.
ఈ నినాదరం ప్రజల మధ్యకు వెళ్లడానికి వైఎస్‌ఆర్ సహజమైన పంచె గెటప్ బాగా అనుకూలించింది. దీనికి తో్డు కేంద్రం ప్రకటించిన రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ విజయవంతంగా రైతుల వద్దకు తీసుకెళ్లగలిగింది. వైఎస్ మరణించిన తరువాత కూడా రైతు బాంధవునిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి గుర్తింపును పొందాలని ఇప్పుడు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. రైతు పోరుబాట పేరుతో ఆయన కూడా పాదయాత్రను చేస్తున్నారు.
ఆనాడు వైఎస్ పాదయాత్రకు వచ్చిన ఆదరణ ఇవాళ చంద్రబాబు చేస్తోన్న యాత్రకు రావడంలేదని పార్టీలోని అంతర్గత వర్గాల చర్చ. వైఎస్‌ఆర్‌కు వచ్చిన ఆదరణ, రైతుబాంధువునిగా మారాలంటే చంద్రబాబు మరింత కష్టపడాల్సి ఉంటుందని సీనియర్లు భావిస్తున్నారు. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు రైతుల్ని ఎలా మెప్పిస్తారో చూడాలి.
Published Date : Friday, 27/1/2012 11:59 AM IST

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |