వైభవ్ సంస్థల అధినేత దారుణహత్య

* మూడ్రోజుల క్రితం అదృశ్యమైన మనోజ్
* హసన్ జిల్లాలో శవమై తేలిన మనోజ్
వైభవ్ సంస్థల అధినేత గ్రంధి మనోజ్‌కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కర్ణాటకలోని సకలేశ్వర్ అటవీ ప్రాంతంలో శవమై తేలాడు. మనోజ్ మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ సాయంత్రం మృతదేహం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విశాఖ నగరంలో వైభవ్ సంస్థలు నిర్వహిస్తున్న గ్రంధి మనోజ్ కుమార్ దారుణహత్యకు గురయ్యాడు. 44ఏళ్ల వయసున్న మనోజ్ బిజినెస్ పనిమీద బెంగళూరు వెళ్ళి అక్కడ ఓ సెవన్ స్టార్ హోటర్‌లో బస చేశారు.
జైపూర్‌లో కొనుగోలు చేసిన దాదాపు 6కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఆయన దగ్గరే ఉన్నాయి. బెంగళూరులో పనులన్నీ ముగించుకొని వ్యాపార పనిమీద ముంబై వెళ్ళేందుకు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన మనోజ్ అనంతరం కనిపించకుండా పోయాడు. ఇవాళ ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో అతని మృతదేహం లభ్యం కావడంతో బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. గతంలోనూ మనోజ్‌పై హత్యయత్నం జరిగింది.
ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు సమీప బంధువు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన వైభవ్ జువెల్లర్స్ అధినేత హతమవడంతో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు వ్యాపారి మనోజ్ హత్యకు నిరసనగా... రేపు విశాఖలో వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసేయాలని నిర్ణయించారు.
Published Date : Thursday, 9/2/2012 3:27 PM IST

Click Here to View/Post Comments (2)
| srinivasachari :
my condolence to manoj family
M.Bhimeswara Rao :
Manoj father Sri. Narendra and his grand father Bala Krishna Garu earned good name in Eluru as Cloth Merchants and they are good hearted and helped a lot to society through their donations. Manoj is good at heart. We have lost a great person. I pray god to give strength to his family memebrs to digest this unexpected calamity.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |