వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన సీఎం
ఆరవై ఐదు వేలకోట్లతో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. గత సంవత్సరానికి కంటే పది వేల కోట్లు అధికం. హైదరాబాద్ జూబ్లీ హాల్‌లో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి రోశయ్య విడుదల చేశారు. రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆమోద ముద్రపడింది. గత సంవత్సరానికి పది వేల కోట్లతో ప్రణాళికను రూపొందించారు. ఇందులో రైతులకు రుణాలు ఎక్కువగా ఇచ్చే విధంగా ప్రణాళికను పొందు పరిచారు. పంట రుణాలకు 26వేల కోట్లు, టర్మ్ లోన్లకు 15వేల కోట్లు, నాన్ ఫార్మ్ సెక్టార్ ఎనిమిది వేల కోట్లు కేటాయించారు. 11వేల 775 కోట్లు స్వయం సహాయక సంఘాలకు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి నాలుగు వేల 690 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. వ్యవసాయ రుణాలు అందజేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. పంటరుణాలను అందించడంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని ఆయన కోరారు . గత సంవత్సరం కరువు, వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినందున రుణాలను రీషెడ్యూల్ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి రఘవీరారెడ్డి బ్యాంకర్లను కోరారు. రైతులకు ఎన్నో విధాలుగా మేలు చేసే ఇన్సూరెన్స్‌పై రైతులను ప్రొత్సహించాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం రుణ ప్రణాళికను పెంచుకుంటూ పోతున్నా.. గ్రామ స్థాయిలో మాత్రం ప్రజలు తమకు రుణాలు అందడంలేదంటూ ఆరోపించడం ఆగడంలేదు.
Watch Video...
Watch Video...
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

