Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
అర్ధరాత్రి వరకు కొనసాగిన జగన్‌ ఓదార్పు యాత్ర


AA

ఆదివారం అర్థరాత్రి వరకు యువనేత జగన్ ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లాలో సాగింది. దారిపొడవునా జనం నీరాజనం పలికారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగమని...యువనేత వెంటే తాము ఉంటామని ప్రజలు జయజయ ధ్వానాలు పలికారు. ఇవాళ కనిగిరి నియోజకవర్గం పామూరు నుంచి ఓదార్పు యాత్ర కొనసాగనుంది. యాత్ర సాగే అన్ని గ్రామాల్లో మహానేత వైఎస్ విగ్రహాలను జగన్‌ ఆవిష్కరించనున్నారు.

ప్రకాశం జిల్లాలో కడప ఎంపీ జగన్ మూడో రోజు ఓదార్పు యాత్రకు గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా అభిమానం అడ్డురావడంతో యాత్ర నెమ్మదిగా ముందుకు సాగింది. ఉదయం కనిగిరి మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ స్మృతివనంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. హనుమంతాపురం, వెలిగండ్ల మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాలలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. పనిలోపనిగా యాత్ర మధ్యలో ఆప్తమిత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి పలుకరించారు.

మూడో రోజు యాత్రలో మూడు కుటుంబాలను జగన్ ఓదార్చారు. సాయంత్రం గన్నవరంలోని రావి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని...రాత్రి పదకొండు గంటలకు కొండ్రాజుపల్లిలో కేశనబోయిన గురవయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అభిమాన నేత మరణాన్ని సహించలేక ప్రాణాలు అర్పించిన వారి కుటుంబ సభ్యులతో మనసువిప్పి మాట్లాడారు.

దాదాపు 15 గ్రామాలలోని ప్రజలను పలుకరిస్తూ జగన్ ముందుకు సాగారు. ప్రతి గ్రామంలో ఆ గ్రామం పేరును సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని....ఇంత మంది ప్రజలు తన వెంట ఉంటే..మరొకరి అండ అవసరం లేదని మాట్లాడారు. అభిమాన జనం తోడు ఉండగా...తాను ఒంటరిని కాదని వెలిగండ్లలో జరిగిన విగ్రహావిష్కరణలో ఉద్వేగభరితంగా జగన్ ప్రసంగించారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు యాత్ర కొనసాగిన గ్రామాల్లో ఇరవై ఒక్క వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు.

Published Date : Monday, Sep 6, 07:52am IST

Watch Video....


Watch Video...
Related Articles
Gallery