Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
గోదావరి, ప్రకాశం బ్యారేజీలలో పెరిగిన నీటి మట్టం


AA

రాష్ట్రంలోని వరద పరిస్థితిపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోదావరి, ప్రకాశం బ్యారేజీలలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లన్నీ నిండుకుండలా తయారయ్యాయి. రాజమండ్రి వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ లోని 175 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి 9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మరోవైపు విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజిలోని 50 గేట్లు ఎత్తివేసి 60వేల 700 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. నాగార్జున సాగర్‌ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు గోదావరిలో కలుస్తుండడంతో భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతోంది. నీటి ఉధృతి 48 అడుగులకు చేరి.. రెండో ప్రమాద హెచ్చరికను తాకింది. నీటి ప్రవాహన్ని చూసేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. మరోవైపు గుంటూరు జిల్లాలోకురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తెనాలి, చిలకలూరిపేట, తాడికొండ, అమరావతి, పాములపాడు, పెదకూరపాడు, సత్తెనపల్లి, పత్తిపాడులో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కోంటున్నారు.

వరద నీటితో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కోస్తాలో కోతకు వచ్చిన పంటలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల మత్స్యకారుల గూడాలలోకి భారీగా నీరు చేరడంతో బోట్‌లలోనే జీవనం సాగిస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సెక్రటేరియట్‌లో జరిగిన రాష్ట్ర మంత్రులు, అధికారుల సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించారు.

Published Date : Monday, Sep 6, 08:07am IST

Watch Video....


Watch Video...
Related Articles
Gallery