Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
APPSC పోస్టుల్లో లబ్దిపొందుతున్నదెవరు ?


AA


* ఎపీపీఎస్సీ భర్తీ చేస్తున్న పోస్టుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందా ?
* సీమాంధ్ర ప్రాంతాలు లబ్ది పొందుతున్నాయా ?
* తెలంగాణకు ఎప్పటి నుంచి అన్యాయం జరుగుతోంది ?
* 42 శాతం పోస్టుల వాటా దక్కడం లేదంటున్న తెలంగాణ వాదుల ఆరోపణలో నిజం ఎంత ?


వారం రోజులుగా జరుగుతున్న రగడలో వాస్తవం లేదంటూ ఏపీపీఎస్సీ అధికారులు
గవర్నర్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి రోశయ్యకు ఒక నోట్‌ను అందజేశారు. ఈ నోట్‌ ప్రతిని టివీ 5 సంపాదించింది. ఇంతకీ ఆ నోట్‌లో ఏముంది...దాని సారాంశం ఏమిటి... విశ్లేషిస్తే పదేళ్ళలో తెలంగాణకు దక్కాల్సిన వాటా కంటే ఎక్కువ పోస్టులే దక్కాయన్నది ఆ నోట్‌ సారాంశం.

ఆశ్చర్యపోతున్నారా... నమ్మలేకపోతున్నారా... కఠోర వాస్తవాలను మీ ముందుంచుతోంది టివి 5. ఇక 2003, 2004 సంవత్సరాల్లో జారీ చేసిన రెండు నోటిఫికేషన్ల ద్వారా 549 పోస్టులను ఎపీపీఎస్సీ భర్తీ చేసింది. వీటిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు 272 పోస్టులు, సీమాంధ్ర ప్రాంత అభ్యర్థులకు 277 పోస్టులు దక్కాయి.

2007లో 189 పోస్టుల భర్తీ కోసం 31/2007 పేరిట ఎపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో సీమాంధ్ర ప్రాంతఅభ్యర్థులు 124 మంది , తెలంగాణ ప్రాంత అభ్యర్థులు 65 మందితో పోస్టులు భర్తీ అయ్యాయి. ఎపీపీఎస్సీ భర్తీ చేస్తున్న పోస్టుల్లో తెలంగాణకు పెద్దగా అన్యాయం జరగడం లేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు దృష్టికి తీసుకెళ్ళగా ఆయన చిత్రమైన సమాధానం ఇచ్చారు. తెలంగాణ అభ్యర్థులతో భర్తీ అవుతున్నాయంటున్న పోస్టుల్లో ఎక్కువగా సెటిలర్లే ఉన్నారన్నారు.

Published Date : Monday, Sep 6, 08:20am IST

Watch Video....


Watch Video...
Related Articles
Gallery