Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
కడప జిల్లాలో వింత స్వామీజీ


AA

మానసిక సమస్యలకు పరిష్కార మార్గం చూపే స్వామీజీయే సాక్షాత్తు మానసికంగా వికలాంగుడు. అయితే..ఇతరుల బాధలు నయం చేయడంలో బహుదిట్ట. మహిమలు గల స్వామీగా..రోగాలు తగ్గించే వైద్యుడిగా పలువురు వ్యాధిగ్రస్థ భక్తశిఖామణులతో కీర్తింపబడుతున్న ఈ మెంటల్లీ, ఫిజికల్లీ డిజేబుల్డ్‌ పర్సన్‌ మూడేళ్లుగా ఇంటిలోపలే మగ్గిపోతున్నాడు. వైఎస్‌ఆర్ జిల్లా ఖాజీపేటలోని వింతస్వామిపై టివి 5 కధనం.

వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేటలో భక్తాగ్రేసరులతో పూజలు, మానసిక, శారీరక వికలాంగులతో ప్రశంసలు పొందుతున్న ఈ స్వామీజీ పేరు వెంకోజీరావు. అయితే...ఈయన కూడా మానసిక వ్యాధిగ్రస్థుడే. మూడేళ్లుగా ఇల్లు వదిలి బయటకు రాని ఈ విచిత్ర స్వామి శరీరంలోకి దేవతలు ఆవహిస్తారని, మానసిక జబ్బులు నయం చేస్తారని భక్తులు చెబుతున్నారు. ఉన్నట్టుండి ఊగిపోయి, పిచ్చి కేకలు వేస్తూ...గెంతుతూ, పాడుతూ చిత్రంగా ప్రవర్తించే వెంకోజీ స్వామిని మానసిక రోగి అని ఎవరైనా అంటే మాత్రం భక్తులకు పిచ్చికోపం వచ్చేస్తుంది. మూడేళ్ల క్రితం వెంకోజీ స్వామీజీ ఇంటిముందు ఓ గుడి నిర్మించారని...అప్పటి నుంచి ఆయన బయటకు వస్తే తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని..అందుకే ఆయన ఇంటిలోనే వుండిపోతున్నారని భక్తులు తెలిపారు.

మానసిక రోగానికి తోడు శారీరకంగా కూడా స్వామి అనారోగ్యానికి గురవ్వడంతో ఎన్నో ఆసుపత్రులలో చూపించామని..అయినా ఫలితం లేకపోయిందని వెంకోజీ కుటుంబ సభ్యులు వాపోయారు. అయితే...ఆయన మాటంటే భక్తులకు వేదవాక్కని చెప్పారు. స్వామీజీ మాటను విశ్వసిస్తే..అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయని భక్తజనవాహిని చెబుతోంది. అందరి బాధలకు పరిష్కారం చూపే స్వామి..తన అనారోగ్యానికి మాత్రం స్వస్థత చేకూర్చుకోలేకపోతున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

Published Date : Monday, Sep 6, 08:25am IST

Watch Video.....


Watch Video...
Related Articles
Gallery