Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
నెల్లూరులో టెన్షన్ టెన్షన్ ?


AA


నెల్లూరు జిల్లాలో తలపెట్టిన జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్సార్ విగ్రహ ప్రతిష్ఠాపన విషయమై నెల్లూరులో వివాదాలు రాజుకుంటున్నాయి. నగరంలోని కొత్తహాలు సెంటర్ దగ్గర విగ్రహం నెలకొల్పాలని రాజీవ్ భవన్ నేతలు తలవగా..మరొక వర్గం దీనిని వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగానే రాత్రి విగ్రహ ప్రతిష్ఠ కోసం గుంతను తవ్వగా కార్పొరేషన్ అధికారులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఐతే.. ట్రాఫిక్ కు ఎలాంటి అడ్డం రాకుండా విగ్రహం నిర్మిస్తామని పీసీసీ కార్యదర్శి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెపుతున్నారు. విగ్రహం ఏర్పాటు కోసం నెల క్రితమే దరఖాస్తు చేసుకున్నా.. కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Published Date : Monday, Sep 6, 11:40am IST

Watch Video....


Watch Video...
Related Articles
Gallery