Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
కాంగ్రెస్‌ నేతల్లో విస్తరణ సందడి


AA

ఎన్నాళ్లో వేచిన ఉదయం అతి త్వరలో రానుంది. క్యాబినెట్ బెర్తులు ఆశిస్తున్నవారిలో కొత్త ఆశలు చిగురించేలా విస్తరణకు సీఎం సైలెంట్‌గా గ్రీన్‌సిగ్నలిచ్చేశారు. అయితే.. ముహూర్తం ఎప్పుడన్నది మాత్రం సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. ముఖ్యమంత్రి సీటెక్కి ఆర్నెల్లు గడిచినా తనదైన క్యాబినెట్‌ క్రియేట్ చేసుకోలేదు రోశయ్య. తన మాట చెల్లుబాటయ్యేలాంటి, ఎదురొత్తులు లేని మంత్రివర్గంపై ఆసక్తి వున్నా.. ఇన్నాళ్లూ ఆయన వెయిట్‌ అండ్ సీ ధోరణినే కొనసాగించారు. అస్మదీయులనుంచి వత్తిడి పెరిగినా తస్మదీయులనుంచి వేధింపులు ఎదురైనా ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారాయన. తన మార్కు స్కెచ్‌ ఒకటి సిద్ధం చేసుకుని పలుమార్లు మేడమ్‌ వద్దకెళ్లినా ఓకే సిగ్నల్ సాధించుకోలేకపోయారు. నిన్నమొన్న ఢిల్లీవెళ్లినప్పుడు కూడా విస్తరణ అజెండా ఏమీ లేదనే మీడియా ముందు చెప్పారాయన. కానీ.. అహ్మద్ పటేల్, వీరప్పమొయిలీ దగ్గర సిట్టింగేసిన రోశయ్య విస్తరణకు రాజముద్ర వేయించుకున్నట్లు నిదానంగా తెలిసింది. నిన్న చీరాలలో సీఎం మాటలు దీనిపై మరింత క్లారిటీనిచ్చాయి. సీఎం అలా సంకేతాలిచ్చారో లేదో.. వెంటనే కూడికలు తీసివేతలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు 34 మంది వున్న క్యాబినెట్‌ బరువు 44కు పెరిగే ఛాన్సుందని సీఎం చెప్పడంతో ఆ పదిమంది కొత్తవాళ్లెవరంటూ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇప్పటికే క్యాబినెట్‌లో వున్న ఐదాగురికి ఉద్వాసన పలికితే.. మొత్తం 15 మంది కొత్తవాళ్లకు ఛాన్స్ దక్కే వీలుంది. కష్టకాలంలో రోశయ్య వెన్నంటి వున్నామంటూ మార్కులేయించుకున్న కొందరు ఎమ్మెల్యేలు తమ బెర్త్ ఖాయమైనట్లే భావిస్తున్నారు. ఇటు సీఎం రెండు సభల ప్రస్తావన తీసుకురావడంతో కౌన్సిల్ మెంబర్లను కూడా మంత్రిపదవి ఊరిస్తోంది. ఇంతవరకూ రాష్ట్ర క్యాబినెట్ చరిత్రలో అంజయ్యదే టాప్‌ స్కోరు. ఆయన అప్పట్లో 60 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. టీ. అంజయ్య తర్వాత జెంబో క్యాబినెట్‌ ఏర్పాటు చేసిన సీఎంగా రోశయ్య రికార్డుకెక్కుతారు. ఇదిలావుంటే విస్తరణకు ముహూర్తం మాత్రం ఇప్పట్లో లేనట్లే తెలుస్తోంది. కౌన్సిల్, రాజ్యసభ ఎన్నికలతో పాటు మేలోనే తెలంగాణాలోని 12 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండడంతో ఈ గజిబిజి ముగిశాకే.. అంటే జూన్‌లో విస్తరణ జరిగే ఛాన్సుంది.


Watch Video...
Related Articles
Gallery