పార్టీ కమిటీ ముందు నన్నపనేని వాదనలు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఇవాళ పార్టీ కమిటీ ముందు హాజరై తన వాదనలను వినిపించనున్నారు. నమ్ముకున్నవారికి న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీయే నయమని ఆమె చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ద్విసభ్య కమిటీని నియమించారు. కమిటీ ముందు హాజరై తన వాదనలను వినిపిస్తానని ఇప్పటికే నన్నపనేని స్పష్టం చేశారు. వివాదానికి కారణమైన తీగల కృష్ణా రెడ్డిని కూడా కమిటీ ముందు పిలవాలన్న ఆమె డిమాండ్‌పై మెత్తపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న రాత్రి పార్టీ నేత ఒకరు చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చిన విందుకు ఆమెను ఆహ్వానించి వివాదాలు మంచివి కావని నచ్చజెప్పినట్లు సమాచారం.
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

