Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
తెలంగాణాపై నో కాంప్రమైజ్‌ : నాగం


AA

తెలంగాణా అంశంపై నో కాంప్రమైజ్‌ అంటున్నారు టీడీపీ తెలంగాణా ఫోరం కన్వీనర్‌ నాగం జనార్థన్‌రెడ్డి....ఈ విషయంలో పార్టీలో ఆమీ తుమీ తేల్చుకోవాలనే ఆలోచనలో ఆయన వున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది...ఒకరిద్దరు పార్టీ వదిలి వెళ్ళినా నష్టం లేదని అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నాగం అంతరంగం పార్టీ వర్గాల్లో సంచనలమవుతోంది.

తెలంగాణా ఉద్యమం ఊపందుకున్న తరువాత... ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటనతో నాగం జనార్థాన్‌రెడ్డి... ఈ ప్రాంతనాకి సంబంధించి పార్టీలో కీలక వ్యక్తిగా మారారు... ఆయనకు చంద్రబాబుకు వున్న అత్యంత సానిహిత్యం కారణంగా పార్టీలో తెలంగాణా ఫోరం ఏర్పాటుకు...దానికి నాగంనే కన్వీనర్‌గా వుండేందుకు అంగీకరించారు...శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించడం కోసం కొన్ని నెలల పాటు నాగం అధ్యయనంలో మునిగిపోయారు... ఈ సందర్భంగా తనకు తెలిసిన విషయాలతో... పూర్తిగా ఆకలింపు చేసుకోవడంతో పాటు ఈ ప్రాంత ప్రజల్లో వున్న మనోభావాలు కూడా తనను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు నాగం ఇటీవల పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు... గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా...ప్రత్యేకించి రాజశేఖర్‌రెడ్డి వున్నప్పుడు పార్టీ తరఫున నాగం వంటికాలుతో లేచేవారు....దూకుడు స్వభావంతో ఘాటైన విమర్శలు చేసేవారు...అయితే గత కొంత కాలంగా ఆయన స్వభావంలో పూర్తిగా మార్పువచ్చింది...అధినేతతో అంటీముట్టన్నట్లు వుంటున్న ఆయన... పార్టీ కార్యాలయానికి దాదాపు దూరంగానే వుంటున్నారు.

గత మూడు నెలల కాలంలో మూడు ముఖ్యమైన సమావేశాల కోసమే ఆయన ఎన్‌టీఆర్‌ ట్రస్టు భవన్‌కు వచ్చారు టీడీఎల్‌పీలోనే విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. అది కూడా తెలంగాణా అంశానికి సంబంధించి మాత్రమే...ఒకప్పుడు ప్రభుత్వంపై విమర్శలకు ఒంటికాలుతో లేచే ఆయన ఇప్పడు అసలు అలాంటి అంశాల జోలికే వెళ్లడం లేదు... తాజాగా మహానాడులో వేదికపైకెక్కినా చంద్రబాబుతో అంటీముట్టనట్లుగానే వున్నారు.

ప్రభుత్వ అవినీతిపై తీర్మానంపై మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన జలయజ్ఞంపై తీర్మానం సందర్భంగాను నోరు మెదిపేందుకు నో అన్నారు. ఇక మహబూబాబాద్‌ లో జరిగిన ఘటనకు సంబంధించి బాబు వద్ద జరిగిన సీనియర్ల సమావేశంలో, ఈ అంశంపై మహానాడులో తీర్మానం చేద్దామన్న నాగం ప్రతిపాదనకు వ్యతిరేకత రావడం.... ఈ సందర్భంగా ఒకరిద్దరు వెళ్ళినా నష్టం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో నొచ్చుకున్నట్లు సమాచారం... దీంతో ఆయన మహానాడు ముగింపు రోజున... అందునా పొలిట్‌బ్యూరో సభ్యుడై వుండి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికకు హాజరుకాలేదు.... ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో నాగం తనకు అత్యంత సన్నిహితులైన పార్టీ నేతలతో పాటు నియోజకవర్గంలోని కొంతమంది ముఖ్యులతో చర్చించినట్లు టీవీ ఫైవ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది....ఇంతవరకూ ఏ విషయంలోనూ తాను కాంప్రమైజ్‌ కాలేదని...ఓబులాపురం అంశంలో సైతం పార్టీ నాయకులు కొందరు రాజీపడ్డా...తను మాత్రం వెనక్కు తగ్గలేదని...తెలంగాణాలోనూ సైతం రాజీపడబోనని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది...

watchVideo.


Watch Video...
Related Articles
Gallery