Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
అమృతం లాంటి "అమ్మఒడి"


AA

అన్నీ సరిగా వుంటేనే పనులు చేసుకోలేని బద్దకస్తులు వున్న ఈ రోజుల్లో రెండు చేతులూ లేకపోయినా అన్నీ పనులూ తానే చేసుకుంటోంది ఓ వికలాంగురాలు. తనను విధి వంచించినా.. తన బిడ్డకు అన్నీ తానే అయింది. రెండు చేతుల్లేక పోయినా తల్లి పాత్రను కూడా పూర్తిస్థాయిలో పోషిస్తున్న అమేజింగ్‌ మదర్‌పై స్పెషల్‌ ఫోకస్‌. అమ్మ... సృష్టిలో ఇదో కమ్మనైన బంధం. ఆకాశమంత ప్రేమను అడగకుండానే అందిస్తుంది అమ్మ. అమృతం లాంటి అమ్మఒడి చిన్నారులకు కల్పవృక్షం కన్నా మిన్న. కానీ.. అందరి అమ్మల్లా బిడ్డకు సపర్యలు చేయడానికి ఈ తల్లికి రెండు చేతులూ లేవు మరి. తనకే ఇంకొకరి సేవలు అవసరం. అయితే అందుకు ఆమె బాధపడలేదు... భయపడలేదు. కాళ్ళనే చేతులుగా మార్చుకుని కన్నబిడ్డకు అన్ని సేవలు నవ్వుతూ చేసేస్తోంది. అంతే కాదు.. ఇంతటి వైకల్యంలోనూ "జాండర్‌ ఆర్మన్‌" మనోధైర్యంతో తన పనులు తానే చేసుకుంటోంది. ఒక్క ఇంటిపని, వంటపనే కాదు. ఫ్రెష్‌కు వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికి కూడా ఆమె ఎవరిపైనా ఆధారపడదు. బయటకు వెళ్ళాలనుకుంటే తానే స్వయంగా కారును డ్రైవ్‌ చేసుకుని వెళ్తుంది. అంతేకాదు ఆరోగ్యంగా వుండేందుకు జిమ్‌కు వెళ్ళి చకచకా ఎక్సర్‌సైజులు కూడా చేసేస్తుంటుంది. ఇదిలా వుంటే.. వికలాంగురాలైన భార్యను నిర్లక్ష్యం చేయకుండా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్తగా ఆదర్శనీయుడయ్యారు మార్క్‌గెర్రా. చేతులు లేకపోయినా పంచడానికి ఆమె దగ్గర సముద్రమంత ప్రేమ వుందని చెప్తున్నాడు. ఆమె భార్యగా దొరకడం తన అదృష్టమంటున్నాడు. అన్నీ సరీగా వున్నా బిడ్డలను పట్టించుకోని తల్లులున్న ఈ రోజుల్లో ఆమె కొడుకును చూసుకుంటున్న వైనం అద్భుతమంటున్నారు చూసినవారంతా. ఆమె మనోధైర్యాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నామంటున్నారు


Watch Video...
Related Articles
Gallery