అతనో రబ్బరు మనిషి...!?
సాహస విన్యాసాలతో ఆకట్టుకుంటున్న రబ్బరు మనిషి . టెన్నీస్ రాకెట్‌లో నుంచి మొత్తం శరీరాన్ని బయటకు తీసుకురావడంతో పాటు అనేక విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే తన సాహస విన్యాలతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం కూడా సంపాదించాడు. భారతీయ రబ్బరు మనిషి అనగానే విజయ్ శర్మ గుర్తుకొస్తాడు. తన చేతులతో, కాళ్లతో చేసే విన్యాసాలే ఆయనకు ఈ పేరును తెచ్చిపెట్టాయి. అతని విన్యాసాలు చూసిన ఎవరికైనా, కాళ్లు, చేతుల్లో ఎముకలున్నాయా...అనే అనుమానం రాక తప్పదు. తేలికగా శరీరాన్ని వంచే సాహసాలతోనే విజయ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే సమయంలోనే శరీరాన్ని ఎలాగైనా వంగి పోతుందనే విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా సాధన చేశాడు. మొదటగా టెన్నిస్ రాకెట్ లో తన శరీరాన్ని దూర్చే సాహసం చేసి విఫలమయ్యాడు. అంతటితో ఊరుకోక మళ్లీ రాకెట్‌లో శరీరాన్ని రప్పించేందుకు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. తన ప్రయత్నాలను టెన్నిస్ రాకెట్‌తోనే ముగించకుండా...కూల్ డ్రింక్ బాటిల్‌ను కాళ్లతో పట్టుకుని మెడమీదుగా తాగే సాహసం చేశాడు. మరో జౌత్సాహికుడు ఓ ప్రదర్శనలో తన శరీరాన్ని రబ్బరు బొమ్మలా వంచేశాడు. తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ప్రతి భాగాన్ని రబ్బరును ఎలా మలుచుతారో...అదే రీతిలో తన శరీరాన్ని వంకర్లు తిప్పారు.
Watch Video...
Watch Video...
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

