Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
బంద్‌కు పిలుపునిచ్చిన రైస్ మిల్లర్లు


AA

నేటి నుంచి రైస్‌మిల్లులు బంద్‌ కానున్నాయి. లేవీ ధాన్యం సేకరణపై ఎఫ్‌సిఐ వైఖరికి నిరసనగా రైస్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ రైస్‌ మిల్లుల బంద్‌కు పిలుపునిచ్చింది. పాత ధరలతో నాలుగేళ్ల కిందటి లేవీ సేకరణ లక్ష్యం కోసం ఎఫ్‌సిఐ పట్టుబడుతోందని అసోసియేషన్‌ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ధాన్యం వ్యాపారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మిల్లర్ల సంఘం నాయకులు ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి సమస్యను విన్నవించారు. సమస్యపై తక్షణం హామీ ఇస్తే తప్ప సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు.

మిల్లర్ల సమ్మెతో తెలంగాణ, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 3,500 రైస్‌ మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. రైస్‌ మిల్లర్ల నిర్ణయంతో రబీ సీజన్‌లో రైతులు పండించిన 17లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కళ్లాలు మార్కెట్‌యార్డుల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.


Watch Video...
Related Articles
Gallery