Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
ఆయన ఆవేదన నిజమేనన్న దానం


AA

క్యాబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి నేను జీవితచరమాంకంలో ఉన్నాను, ఈ పదవి కావాలని నేను కోరుకోలేదు, అధిష్టానం ఆదేశిస్తే పని చేస్తున్నా, ఈ విషయాన్ని గ్రహించండి’ అంటూ ముఖ్యమంత్రి కె. రోశయ్య మరోసారి మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. ‘ప్రతిపక్షాలు మనపై అనేక ఆరోపణలు చేస్తున్నాయి, దీనిపై మంత్రులు శాఖల వారీగా కానీ, సమష్టిగా కానీ స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు, ఇలాగైతే మీకే కష్టం’ అని ఆవేదన వ్యక్తం చేసింది నిజమేనని, వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్‌ చెప్పారు. అయితే పత్రికల్లో మాత్రం మరో విధంగా వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత సిఎం వై.ఎస్‌ పథకాల అమలే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రోశయ్య.. తన ఆలోచనలను సహచరులతో పంచుకున్నారన్నారు. మంత్రివర్గ సమావేశ వివరాలు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి కొందరు పనిలేని మంత్రులు లీక్‌ చేస్తున్నారంటూ సీఎం వ్యాఖ్యానించడంతో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మనస్తాపం చెంది, మీరు మమ్మల్ని నమ్మకపోతే రాజీనామాకు x కూడా సిద్దమే అనటం నిజమేనని దానం చెప్పారు.


Watch Video...
Related Articles
Gallery