|
|
|
|
|
|
|
|
|
|
|
 |
|
|
|
|
|
|
|
|
మంత్రివర్గ ఏర్పాటుపై వీడని ముడి |
|
|
|
నవంబర్ 3, 2009, మంగళవారం |
|
|
మహారాష్ట్రలో సర్కార్ ఏర్పడి రెండు నెలలు గడిచినా మంత్రివర్గ ఏర్పాటుపై పీట ముడి వీడలేదు. వాస్తవానికి ఈరోజు కొత్త క్యాబినెట్ సమావేశం జరగాల్సి వున్నది. ఇప్పటికైనా మంత్రుల విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోతే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్-ఎన్సీపి ఎవరికి వారు శాఖలు, మంత్రుల సంఖ్యపై పట్టుబట్టటంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. హోంమంత్రి పదవిని ఎన్సీపి నుంచి ముగ్గురు గతంలో నిర్వహించారు. ఛగన్ భుజబుల్, ఆర్.ఆర్ పాటిల్, జయంతి పాటిల్ గతంలో హోంమంత్రి బాధ్యతలు నిర్వహించారు. తెల్గీ కుంభకోణం, నవంబర్ 11 దాడుల దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి ఎన్సీపి మంత్రులు పదవి నుంచి వైదొలిగారు. ప్రధానంగా హోం శాఖ పైనే కాంగ్రెస్-ఎన్సీపి భీష్మించుకున్నాయి. ఈ హైప్రొఫైల్ పదవి తప్ప మరొకటి తనకు వద్దని ఛగన్ భుజబుల్ పట్టుపట్టారు. హోం శాఖ తమ వద్ద వుంటే తప్ప రాష్ట్రంలో తమ హవా సాగదని ఎన్సీపి భావిస్తున్నది. ఎన్సీపి వైఖరితో విసుగెత్తిన కాంగ్రెస్ కీలకమైన ఆర్ధిక శాఖను అప్పగించటానికి నో అంటోంది. అయితే ఇరు పార్టీల మధ్య పేచీ కేవలం శాఖ లకు మాత్రమే పరిమితం కాలేదు. మంత్రుల సంఖ్యపై కూడా ఇరు పార్టీల మధ్య వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ తమవద్ద 23 ఫోర్టిఫోలియోలను అట్టి పెట్టుకుని ఎన్సీపి కి మాత్రం 20 మాత్రమే ఇస్తానంటోంది. దీనిపై ఎన్సీపి ససేమిరా అంటోంది. 22 : 21 షేరింగ్ ఫార్ములా తమకు ఆమోద యోగ్యమని ఆ పార్టీ వాదిస్తున్నది. గతంలో కాంగ్రెస్-ఎన్సీపి సంకీర్ణం అధికారంలోకి వచ్చినప్పడు కూడా ఇదే పరిస్ధితి కొనసాగిందని ఆరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మానిక్ రావు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావడంపై విపక్ష శివసేన-భాజపా కూటమితో సహా వైరి పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. |
|
|
|
|
|
|
|
Rate this Article : |
|
(Current Rating :2.00/5 - Total Voters :5) |
|
|
|
 |
Most Read Stories in last 7 days |
|
|
|
|
|
|
|
This Page Viewed 60 times |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|