|
|
 |
|
|
|
|
|
|
|
|
గవర్నర్ ఎన్డీ తివారీకి ఊరట |
|
|
|
నవంబర్ 3, 2009, మంగళవారం |
|
|
రాష్ట్ర గవర్నర్ ఎన్‌డి తివారికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన పితృత్వ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఉజ్వల శర్మ అనే మహిళ తన కుమారుడు రోహిత్ శేఖర్‌కు తండ్రి ఎన్‌డీ తివారి అంటూ ఢిల్లీహైకోర్టులో పిటీషన్ వేసింది. ఇంతకుమునుపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తివారి పనిచేశారు. తివారీతో తనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె రాతపూర్వకంగా కోర్టుకు తెలిపింది. ప్రతిష్ఠాత్మక కుటుంబం నుంచి వచ్చిన తివారి తనపట్ల ఆదరణ, ప్రేమ చూపారని, తరవాత రోహిత్‌ను కొడుకుగా బహిరంగంగా అంగీకరించేందుకు నిరాకరించారని ఆమె ఆరోపించారు. అయితే వీటిని తివారీ ఖండించారు. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అక్టోబర్ 13న తీర్పు వాయిదా వేసింది. న్యాయమూర్తి ఎన్.ఎస్. ధింగ్రా ఇవాళ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. |
|
|
|
|
|
|