|
|
 |
|
|
|
|
|
|
|
|
రసకందాయంలో క'ర్నాటకం' |
|
|
|
నవంబర్ 3, 2009, మంగళవారం |
|
|
కర్నాటక రాజకీయాలు మరింత రసకందాయంలో పడుతున్నాయి. బీజేపీ రెబెల్స్‌గా పేరుపడ్డ గాలి బ్రదర్స్ మంకు పట్టు వీడడం లేదు. ప్రభుత్వంలో నాయకత్వం మార్పు కోసం వారు చేస్తున్న డిమాండ్ పార్టీ అధిష్టానానికి మింగుడపడటం లేదు. అధిష్టానం యడ్యూరప్పకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన వరద సహాయక చర్యల కోసం క్యాంపేయిన్ ప్రారంభించారు. పట్టు వీడిపోతోందనుకొని విధిలేని పరిస్థితుల్లో పర్యాటక శాఖామంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కొత్త నాయకుడు వస్తే బీజేపీ పది కాలాల పాటు కొనసాగుతుందనే విషయాన్ని జైట్లీకి వివరించారు. అ తర్వాత సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఓ వైపు శాసనసభ్యులు పెట్టిన డిమాండ్ న్యాయ సమ్మతమేనంటున్న గాలి బ్రదర్స్.. మరోవైపు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామంటున్నారు. |
|
|
|
|
|
|