|
|
|
|
|
|
|
|
|
|
|
 |
|
|
|
|
|
|
|
|
వివాదాస్పదమైన వందేమాతరం గీతం |
|
|
|
నవంబర్ 3, 2009, మంగళవారం |
|
|
బకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన వందేమాతరం గీతం వివాదాస్పదమైంది. ఈ గీతంలో ఉన్న కొన్ని చరణాలు ముస్లింల మౌలిక విశ్వాలకు విరుద్ధంగా ఉన్నందున, ఈ గీతాన్ని ఆలపించవద్దని జమాయితే ఉలేమా హింద్ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ఒక తీర్మానం కూడా చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని దేయోబంద్‌లో ఇవాళ జరిగిన జమాయితే ఉలేమా హింద్ జాతీయ సమావేశం వందేమాతరం గీతాన్ని ముస్లీంలెవ్వరూ ఆలపించకూడదని ఫత్వా జారీ చేసింది. ఈ దేశభక్తి గీతంలోని కొన్ని చరణాలు ముస్లింల విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అల్లాను తప్ప మరెవ్వరినీ పూజించరని లాబోర్డు స్పష్టం చేసింది. దేశాన్ని ముస్లింలు ప్రేమిస్తారని, కాని ఆరాధాన దేవునికే మాత్రమేనని స్పష్టం చేసింది. దేశంలోని నలుమూల నుంచి వచ్చిన పది వేల మంది మత పెద్దలు ఈ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సమాజంలోని అన్ని వర్గాలకు ముస్లింలు దగ్గరవడానికి ఇదే సరైన సమయని అన్నారు. ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన జమైతే ఈ ఉలేమా హింద్ పాత్ర ఎవరూ విస్మరించరని చిదంబరం అన్నారు. జమాయితే సమావేశంలో అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు. ముస్లిములు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఈ సమావేశం చర్చించింది. |
|
|
|
|
|
|
|
Rate this Article : |
|
(Current Rating :2.00/5 - Total Voters :5) |
|
|
|
 |
Most Read Stories in last 7 days |
|
|
|
|
|
|
|
This Page Viewed 129 times |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|