|
|
 |
|
|
|
|
|
|
|
|
మంత్రివర్గం ఏర్పాటుపై వీడని పీటముడి |
|
|
|
నవంబర్ 4, 2009, బుధవారం |
|
|
మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపి మంత్రివర్గం ఏర్పాటుపై పీటముడి ఇంకా వీడలేదు. నిన్న అపధర్మ సిఎం, డిప్యూటీ సిఎంలు అశోక్ చవాన్, ఛగన్ భుజబల్ రాష్ట్ర గవర్నర్ జమీర్ తో సమావేశమై ఇరు పార్టీల నేతలు విభేదాలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఎన్సీపి సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ మాత్రం మంత్రివర్గ ఏర్పాటులో ఎదురౌవుతున్న ఇబ్బందులను తొలిగించుకుంటామని ఓ వైపు చెబుతున్నారు. కానీ మరో నేత ఛగన్ భుజబల్ మాత్రం మంత్రివర్గం ఏర్పాటుపై జాప్యానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని మండిపడ్డారు. ఐదు కీలక ఫోర్టిఫోలియోలను తాము కోరుకుంటే కాంగ్రెస్ నిరాకరించిందని ఆయన వాదిస్తున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్-ఎన్సీపి విభేదాలను పరిష్కరించుకోని నేపధ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా రాష్ట్రపతి పాలన విధించాలని విపక్ష శివసేన- బిజెపి కూటమి డిమాండ్ చేసింది. |
|
|
|
|
|
|