|
|
 |
|
|
|
|
|
|
|
|
మహారాష్ట్రలో రాజకీయ డ్రామాకు తెర |
|
|
|
నవంబర్ 6, 2009, శుక్రవారం |
|
|
మహారాష్ట్రలో రెండు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ డ్రామాకు నేడు తెర పడనుంది. మంత్రులు, శాఖలపై పట్టుదలకు పోయిన కాంగ్రెస్-ఎన్సీపి కూటమి మధ్య ఎట్టకేలకు నిన్న ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గవర్నర్ జమీర్ కు కొత్తగా కొలువు తీరే మంత్రుల జాబితాను కూడా ఇరు పార్టీలు నిన్నే సమర్పించాయి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఇవాళ జరుగుతుంది. ఇరు పక్షాల కుదిరిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు 22 మంది మంత్రులు, ఎన్సీపికి 20 మంత్రి పదవులు దక్కుతాయి. కీలకమైన హోం మంత్రి పదవితో పాటు ఆర్దిక, విద్యుత్ వంటి కీలక శాఖలు ఎన్సీపికివ్వటానికి కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. |
|
|
|
|
|
|