|
|
 |
|
|
|
|
|
|
|
|
నేడు హస్తినాపురానికి రోశయ్య |
|
|
|
నవంబర్ 6, 2009, శుక్రవారం |
|
|
- ఢిల్లీకి వెళ్తున్న రోశయ్య
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకే తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు సియం రోశయ్య స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న కరువు, వరద పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలను అధిష్టానానికి, ప్రధానమంత్రికి అందజేయడానికి ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఏమైనా విషయాలను పార్టీ అధినేత సోనియాగానీ, పియం మన్మోహన్‌గానీ ప్రస్తావిస్తే వాటిపై మాట్లాడటం మినహా... తాను ఇంకా ఇతర విషయాలేవీ ఈ పర్యటనలో అధిష్టానంతో చర్చించే ఆలోచన లేదని రోశయ్య స్పష్టం చేశారు. |
|
|
|
|
|
|